
తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే లతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హుజూరాబాద్ ప్రతినిధులు సాధించే విజయం మీదే యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందన్నారు.