- Telugu News » Ap » Non bailable warrant against finance secretary
ఆర్థిక శాఖ కార్యదర్శిపై నాన్ బెయిలబుల్ వారెంట్
ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన హైకోర్టు అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని కేసు విచారణలో కోర్టుకు ఆలస్యంగా వచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ దాఖలు […]
Written By:
, Updated On : July 24, 2021 / 03:42 PM IST

ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన హైకోర్టు అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని కేసు విచారణలో కోర్టుకు ఆలస్యంగా వచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా ఉంటుందని తెలిపింది.