
ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎలాంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముగిసిన అనంతరం అందులో పాల్గొన్న సురేశ్ మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరీక్షలపై మొదటి నుంచి తమ వైఖరి ఒక్కటే అని మంత్రి వివరించారు.