
తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కొత్తగా అభ్యర్థనలు రాలేదని కేంద్రం తెలిపింది. గోదావరి పరివాహక రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం 1969 లో గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. 1980 జూలైలో ట్రైబ్యునల్ అవార్డు ప్రకటించినట్లు తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. మరోవైపు ప్రధాని మోదీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేఖ రాశారు.