ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో జరిగిన సంఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లోగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలు నివేదికలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురైంది. కుటుంబ సభ్యులను పిలువకుండా ఎందుకు అర్ధరాత్రే అంత్యక్రియలు జరపాల్సి వచ్చిందని వీటన్నింటికీ జవాబులు ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ డీజీపీకీ […]
Written By:
, Updated On : October 1, 2020 / 10:14 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో జరిగిన సంఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లోగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలు నివేదికలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురైంది. కుటుంబ సభ్యులను పిలువకుండా ఎందుకు అర్ధరాత్రే అంత్యక్రియలు జరపాల్సి వచ్చిందని వీటన్నింటికీ జవాబులు ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ డీజీపీకీ మహిళా కమిషన్ లేఖ రాసింది.