
న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కైల్ జేమీసన్ ఔటయ్యాడు. షమి వేసిన 87 వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద బూమ్రా చేతికి చిక్కాడు. దాంతో ఆ జట్టు 192 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ 37 పరుగుతో, సౌధీ ఉన్నారు.