
భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ ఒత్తిడిలోకి జారుకుంది. 101/2 ఐదో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 117 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్ లో రాస్ టేలర్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రీ నీకోలస్ ను ఇషాంత్ పెవిలియన్ కు పంపి కివీస్ ను మరో దెబ్బ కొట్టాడు. తర్వాత షమీ వేసిన బంతిని వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ వికెట్లను గిరాటేసింది. దీంతో 135 పరుగులకే కివీస్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.