
భద్రతా సమస్యల కారణంగా పాకిస్థాన్ పర్యటనను న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రద్దు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా పాక్ తో కివీస్ జట్ట 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 03 వరకు సుదీర్ఘంగా ఈ సిరీస్ నిర్వహించాల్సి ఉంది. ఈ రోజు తొలి వన్డే ప్రారంభం కానుందనగా కివీస్ జట్టు ఈ రద్దు నిర్ణయం తీసుకుంది.