https://oktelugu.com/

టిసిఎస్ లో ఉద్యోగ అవకాశాలు

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎంతగానో పోటీ వున్నా ఈ రోజుల్లో కేవలం ఒక్క పరీక్షా రాసి సాఫ్ట్ వేర్ జాబ్ పొందవచ్చు. అయితే సాఫ్ట్ వేర్ జాబ్ లకు కంపెనీలు దాదాపుగా మంచి పేరున్న కాలేజీలలో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ను నిర్వహిస్తూవుంటాయి. అయితే చిన్న కాలేజీలలో చదువుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అవకాశం ఇవ్వడానికి టాటా కన్సల్టెన్సీ ఒక పరీక్షా నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో మన ప్రతిభ నిరూపించుకుంటే సరిపోతుంది. మనకు భారత దిగ్గజ కంపెనీలలో […]

Written By: NARESH, Updated On : September 27, 2020 8:29 pm

tata consultancy services

Follow us on

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు ఎంతగానో పోటీ వున్నా ఈ రోజుల్లో కేవలం ఒక్క పరీక్షా రాసి సాఫ్ట్ వేర్ జాబ్ పొందవచ్చు. అయితే సాఫ్ట్ వేర్ జాబ్ లకు కంపెనీలు దాదాపుగా మంచి పేరున్న కాలేజీలలో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ ను నిర్వహిస్తూవుంటాయి. అయితే చిన్న కాలేజీలలో చదువుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అవకాశం ఇవ్వడానికి టాటా కన్సల్టెన్సీ ఒక పరీక్షా నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో మన ప్రతిభ నిరూపించుకుంటే సరిపోతుంది. మనకు భారత దిగ్గజ కంపెనీలలో ఒకటైన టాటా కంపెనీ లో సాఫ్ట్ వేర్ జాబ్ పొందవచ్చు. బీటెక్‌, బీఎస్సీ, బీఈ, ఎంఈ, ఎంటెక్‌, ఎమ్మెస్సీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు లేక ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు పూర్తి చేసి, ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారు ఎన్‌క్యూటీ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్షను త్వరలోనే నిర్వహించనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.