
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా వాయిదా పడిన నీట్-పీజీ పరీక్షకు కేంద్రం కొత్త తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 11ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు పరీక్షకు ఏర్పాట్లు చేయనున్నారు. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు నెలాఖరు వరకు ఈ పరీక్ష నిర్వహించబోమని గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నీట్ పీజీ పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించాలని నిర్ణయించాం. విద్యార్థులకు నా శుభాకాంక్షలు అని మాండవీయ ట్వీట్ చేశారు.