
రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వనం ఉండేలా చూడాలన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అర్బన్ ల్యాండ్ ను వినియోగించుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కొండలు, గుట్టల ప్రాంతాల్లో ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజా అవసరాల కోసం భూమి అవసరమైన చోట చట్టం ప్రకారం భూ సేకరణ చేపట్టాలని పేర్కొన్నారు.