Nari Nari Naduma Murari : చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరో శర్వానంద్(Sharwnand), ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) చిత్రం తో భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకొని, మంచి కం బ్యాక్ ఇచ్చాడు. శర్వానంద్ కి సంక్రాంతి మామూలు రేంజ్ లో కలిసి రాలేదు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’,’శతమానం భవతి’ చిత్రాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయినవే. ఆ తర్వాత మరో హిట్ కోసం శర్వానంద్ చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు సరైన ఎంటర్టైనెర్ తో ఈ సంక్రాంతికి మన ముందుకొచ్చి, తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఈ చిత్రం విడుదలై నిన్నటితో మూడు రోజులు పూర్తి అయ్యింది. ఈ మూడు రోజులకు ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
మిగిలిన సంక్రాంతి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి దొరికిన థియేటర్స్, షోస్ చాలా అంటే చాలా తక్కువ. అయినప్పటికీ కూడా కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంటూ మంచి వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 3వ రోజు కూడా కోటి 75 లక్షల రూపాయిల షేర్ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చింది. ప్రాంతాల వారీగా మొదటి మూడు రోజులకు వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 1 కోటి 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , సీడెడ్ ప్రాంతం నుండి 39 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రానికి 5 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 8 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7 కోట్ల 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను, 13 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల 25 లక్షలు. అంటే మరో మూడు కోట్ల రూపాయిల షేర్ ని రాబడితే ఈ సినిమా సూపర్ హిట్ అయిపొయినట్టే. ఈరోజుతో ఆ మార్కుని కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
