Bharta Mahashayulaku Vignapthi : ఆవు పులి కథ గురించి మీరందరు వినే ఉంటారు. ఇప్పుడు రవితేజ సినిమాల పరిస్థితి సరిగ్గా ఆ కథ లాగే తయారైంది. ఒకప్పుడు రవితేజ సినిమా అంటే బయ్యర్స్ కి మినిమం గ్యారంటీ. కానీ ఇప్పుడు రవితేజ సినిమా బాగుంది అని చెప్పినా ఎవ్వరు నమ్మి థియేటర్స్ వైపు కదలడం లేదు. ధమాకా తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకున్నాడు. ఆ సినిమాల ప్రభావం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం పై చాలా బలంగా పడింది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంది, కామెడీ వర్కౌట్ అయ్యింది, రవితేజ ఎనర్జీ అనంతం అంటూ టాక్ వచ్చింది. కచ్చితంగా ఈ టాక్ కలెక్షన్స్ పై రిఫ్లెక్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ ప్రాంతం నుండి 56 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి 4 కోట్ల 15 లక్షల రూపాయిలు రాబట్టింది. ఓవరాల్ గా 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 6 కోట్ల 96 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 11 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్రా/ తెలంగాణ నుండి ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , కర్ణాటక + తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 5 రోజుల్లో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది అత్యంత దారుణమైన వసూళ్లు అనే చెప్పాలి.
ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి కేవలం 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కుర్ర హీరోలు కూడా, ప్రీమియర్ షోస్ నుండి రాబట్టే షేర్ వసూళ్లను, రవితేజ ఇప్పుడు కనీసం ఫుల్ రన్ లో కూడా రాబట్టలేకపోతున్నాడు, ఆయన మార్కెట్ ని గత చిత్రాలు ఈ రేంజ్ లో దెబ్బ తీశాయి అంటూ రవితేజ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి 8 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ 14.45 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. విడుదలకు ముందు 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 11 కోట్ల 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి అన్నమాట.
