Biggest Hit Films In India: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా సినిమాని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కిందనే చెప్పాలి. వరుసగా తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చి భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక ఇండియాలో భారీ కలెక్షన్ ను సాధించిన సినిమాల్లో మొదట ‘దంగల్’ సినిమా 2000 కోట్లు మార్క్ ను అందుకుని మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో ‘ పుష్ప 2’ సినిమా నిలిచింది. ఈ మూవీ 1850 కోట్లతో భారీ రికార్డుని క్రియేట్ చేసింది. ఇక మూడోవ స్థానంలో ‘బాహుబలి 2’ సినిమా ఉండడం విశేషం…
ఈ సినిమాకి 1800 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే వచ్చాయి…ఇక టాప్ త్రీ లో ఉన్న ఈ సినిమాలను బీట్ చేయడానికి ప్రతి ఒక్క హీరో దర్శకుడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం వచ్చే సినిమాలతో ఈ టాప్ త్రీ రికార్డ్ బ్రేక్ అవ్వబోతుందనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి.
స్టార్ హీరోలందరు వాళ్ళ సినిమాలతో భారీ విజయాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు…వాటిలో ఎన్ని సినిమాలు ఈ రికార్డులను బ్రేక్ చేసి ముందుకు సాగుతాయి అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టిన టాప్ 3 సినిమాల్లో రెండు సినిమాలు తెలుగు సినిమాలే ఉండటం విశేషం…
ఈ సంవత్సరం తెలుగు నుంచి వచ్చే ప్రతి స్టార్ హీరో సినిమా కూడా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. ఈ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాయి వాళ్ళు సాధించే విజయాలు వాళ్ళని ఎలాంటి ప్లేస్ లో నిలబెడతాయి అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
