Nagarjuna Yadav : ఒకరి గురించి విమర్శ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. ఒకరి గురించి మనం ఆరోపణలు చేస్తున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం తెలిసి ఉండాలి. అలాకాకుండా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. తదుపరి చర్యలు కూడా ఇష్టం వచ్చినట్టుగానే జరుగుతుంటాయి. పాపం ఇప్పుడు వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నాగార్జున యాదవ్ తన పార్టీ సొంత భజన ఛానల్ సాక్షిలో లేకి వ్యాఖ్యలు చేశారు. దానికి తగ్గట్టు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు.
వైసిపి అధికార ప్రతినిధిగా నాగార్జున యాదవ్ కొనసాగుతున్నారు. ఇటీవల వైసిపి సొంత పార్టీ బాకా చానల్ సాక్షిలో ఒక డిబేట్ సందర్భంగా నాగార్జున యాదవ్ మాట్లాడారు. మాట్లాడుతూ మాట్లాడుతూ డెలివరీ బాయ్.. స్విగ్గీ బాయ్.. జొమాటో భాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మొదట్లో అతను మాట్లాడుతుంటే ఎవరికీ అర్థం కాలేదు.. అసలు అలా ఎందుకు మాట్లాడుతున్నాడు.. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు
.. అనేది తెలియ రాలేదు.
సాక్షి టీవీలో ఆ షో ను హోస్ట్ చేస్తున్న జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు పదేపదే రేవంత్ నా అలా అనేది అన్నారు. దీంతో నాగార్జున యాదవ్ చేసిన ఆ లేకి డెలివరీ వ్యాఖ్యలు రేవంత్ ను ఉద్దేశించి అని అందరికీ అర్థమైంది. అసలు ఇది సోషల్ మీడియా కాలం.. ఏదైనా సరే వెంటనే బయటికి వస్తుంది. జనాలకు తెలుస్తుంది. నాగార్జున యాదవ్ నోటికంపు కూడా త్వరగానే తెలిసింది. ఇంకేముంది తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే నాగర్జున యాదవ్ ఇంటికి వెళ్లారు. దర్జాగా హైదరాబాద్ నగరానికి డెలివరీ చేశారు. దీనిపై సాక్షి నంగనాచికబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ఎటువంటి నోటు ఇవ్వకుండానే నాగార్జునను తీసుకెళ్లారని.. ఫలితంగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ప్రచారం మొదలుపెట్టింది. వైసిపి కూడా గొంతు సవరించి.. రేవంత్ మీద ఉన్న ఆగ్రహాన్ని.. చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని.. ప్రదర్శించడం ప్రారంభించింది.
ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతం నుంచి రావణ్.. ప్రొఫెసర్ నాగేశ్వర్ వరకు.. కొంతమంది బృందాలను ఆంధ్రపైకి ఉసిగొలిపినట్టు తెలుస్తోంది. ఆ ప్రణాళిక పారకపోవడంతో ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు ఉసిగొల్పే కుట్ర మొదలైంది. అందువల్లే కొమ్మినేని శ్రీనివాస్ లైవ్ షోలో నాగార్జున యాదవ్ దారుణంగా.. స్విగ్గి.. జొమాటో డెలివరీ బాయ్ ల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా తిట్టారు. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు కలగజేసుకొని.. ఎవర్ని.. రేవంత్ నా.. అంటూ అనేకసార్లు ఆయన పేరు చెప్పారు. అప్పుడుగాని మనకు నాగార్జున చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మీద అని అర్థం కాదు.
ఆ వీడియో చూస్తే ఒకటి మాత్రం అర్థం అవుతుంది.. నువ్వు నీ మురికి నోటితో తిట్టేసేయ్.. నేను వద్దు అంటూ డ్రామాలు ఆడతాను.. అన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షోలో అమరావతి మహిళలను వే** అని మాట్లాడించారు. ఆ తర్వాత జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ ఆయన వ్యవహరించే తీరు మారడం లేదు. పెద్దమనిషిగా.. సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న ఆయన ఇలా దిగజారిపోవడం నిజంగా బాధాకరం
ఇప్పటికిప్పుడు వైసిపి అధికార ప్రతినిధికి తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఇష్టానుసారంగా మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది.. ఇదంతా చూస్తుంటే వందల కోట్లతో తెలంగాణ మీదికి దండెత్తే ప్రణాళిక విజయవంతంగా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటువంటి వ్యక్తుల పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటువంటి శక్తులు మరింత రెచ్చిపోయి.. రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది.
