
నా ఫ్రెండ్ మూవీ బ్లాక్ బస్టర్ హ్యాపీ అంటూ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో మాచో హీరో గోపీచంద్, తమన్నా జంటగా రూపొందిన సినిమా సీటీమార్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపడుతోంది. చిత్రాన్ని డార్లింగ్ ప్రభాస్ చూడటం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.