
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదంది. కనీసం ఒకరోజు ముందు దర్యాప్తు అధికారులు పిటిషనర్ కు సమాచారం ఇవ్వాలని సూచించింది. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావొచ్చని తెలిపింది. దేశ ద్రోహం కేసులో వైసీపీ నర్సపురం ఎంపీని సీఐడీ పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అనంతరం బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం రఘురామకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.