
సినిమా ప్రియులకు శుభవార్త. గత కొద్ది నెలల నుంచి మూతబడ్డ సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. ఈనెల 23వ తేదీ నుంచి సినిమా థియేటర్లను తెరవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్ ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి థియేటర్ల ఓపెన్ పై నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో పని చేసే సిబ్బంది ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు.