
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కరోనా ఉదృతి కాస్త అదుపులోకి రావడంతో రెండు రాష్ట్రాలు సినిమాల ప్రదర్శనలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం సామర్థ్యంతో రోజుకు 3 ఆటల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో 100 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడుస్తున్నాయి. నేటి నుంచి తిమ్మరుసు, ఇష్క్, నరసింహాపురం చిత్రాలను ఆయా సినిమా హాళ్లలో ప్రదర్శిస్తున్నారు.