సింగరేణిలో ఉద్యోగ ఖాళీల భర్తీ పారదర్శకంగా జరగనుందని బలరాం తెలిపారు. నిరుద్యోగులు ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దని అక్రమాలు, ఆరోపణలకు తావు లేకుండా ఈ పరీక్షల నిర్వహణ జరగనుందని బలరాం చెప్పుకొచ్చారు. ఈ నెల 25వ తేదీన జరిగే సమావేశంలో సంస్థ సాధించిన లాభాలకు సంబంధించిన వివరాలను చెబుతామని బలరాం వెల్లడించారు. దసరా సమయానికి లాభాల్లో కార్మికుల వాటా గురించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని బలరాం చెప్పుకొచ్చారు.
ఎవరైతే సింగరేణి నుంచి బొగ్గును కొనుగోలు చేశారో వాళ్లు వారం రోజుల్లోగా బకాయిలను చెల్లించాలని బలరాం సూచనలు చేశారు. బకాయిలను చెల్లించని పక్షంలో 7.5 శాతం వడ్డీ విధిస్తామని బలరాం వెల్లడించారు. బకాయిలపై వడ్డీ విధిస్తే సంస్థకు ఏకంగా 100 కోట్ల రూపాయల లాభం రానుందని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజైన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సింగరేణి సంస్థ త్వరలో పరీక్ష తేదీని కూడా వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.