
మనస్తాపానికి గురైన తల్లీ కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. పుట్లూరు మండలం చింతలపల్లికి చెందిన రామకృష్ణారెడ్డి గతేడాది కరోనాతో మృతి చెందారు. అతడి అనంతరం భార్య, కుమార్తె తాడిపత్రి వచ్చి కృష్ణాపురం 16వ రోడ్డులో నివాసం ఉంటున్నారు. కుమార్తె అపర్ణ పుట్లూరు మండలం గూడూరు సచివాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహించేవారు. తండ్రి మరణించినప్పటి నుంచి అపర్ణతో పాటు తల్లి తరచూ బాధపడుతుండేవారు. ఆదివారం రాత్రి తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.