
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయలాంటూ నర్సాపురం ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్ పై ఈనెల 1న జగన్ కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కౌంటర్ లో జగన్ పేర్కొన్న అంశాలపై ఎంపీ సమాధానమిచ్చారు. రఘురామ రీజాయిండర్ పై వాదనలు వినిపించేందుకు జగన్ తరఫున న్యాయవాదులు న్యాయమూర్తిని సమయం కోరారు. ఈ మేరకు కోర్టు విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.