Madvi Hidma Latest Photo: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా తాజా పొటో వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన అతను ప్రస్తుతం ఎలా ఉంటారనేది ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి వెల్లడి కాలేదు. దాదాపు పాతికేళ్ల క్రితం నాటి ఫొటోనే ఇన్నాళ్లుూ అందుబాటులో ఉంది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో అతడి తాజా చిత్రం బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పలు ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.