
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కార్మిక, కర్షక కష్టజీవులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ధి సాధ్యమైందని, మానవజాతి పురోగతి, కష్టం చేసే చేతుల మీది నుంచే కొనసాగుతూ వస్తున్నదని సీఎం తెలిపారు. వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులతో పాటు వ్యవసాయాధారిత భారత దేశంలో అధిక జానాభా భూమిని నమ్ముకుని బతుకుతున్నారని పేర్కొన్నారు.