
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత క్రమంగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముక్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో ఏపీలో 17,354 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా 64 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,98,795కు చేరుకుంది ఇప్పటి వరకు 9,67,823 మంది డిశ్చార్జ్ అయ్యారు.