
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 13,400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 21,133 మంది కోలుకున్నారు. 94 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1,68,5142కు పెరిగాయి. 1,50,8515 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 1,65,795 పెరిగాయి. మొత్తం మరణాలు 10,832 చేరాయి. ఇవాళ రాష్ట్రంలో 84,232 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.