
తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు జమ చేేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63,25,695 మంది అర్హులను గుర్తించిన సీసీఎల్ ఏ తుది జాబితాను వ్యవసాయ శాఖకు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150.18 లక్షల ఎకరాలకు గాను రూ. 7,508.78 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.