https://oktelugu.com/

Mohan Babu : సౌందర్య-మోహన్ బాబు ఆస్తి వివాదం… సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త, కీలక కామెంట్స్

Mohan Babu సౌందర్యకు జరిగింది ప్రమాదం కాదు. దాని వెనుక నటుడు మోహన్ బాబు ఉన్నాడు. సౌందర్యతో మోహన్ బాబుకు ఆస్తి వివాదం నెలకొన్న నేపథ్యంలో సాక్ష్యాలు లేకుండా ఆమెను హత్య చేశాడంటూ చిట్టిమల్లు అనే వ్యక్తి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు మాట్లాడాడు. కీలక విషయాలు వెల్లడించారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2025 / 07:02 PM IST
    Follow us on

    Mohan Babu : నటి సౌందర్య 2004లో విమాన ప్రమాదంలో మరణించింది. ఆమెతో పాటు ప్రయాణం చేస్తున్న సోదరుడు అమర్నాథ్ కన్నుమూశాడు. ఈ ఘటన జరిగి రెండు దశాబ్దాలు అవుతుంది. తెలంగాణకు చెందిన చిట్టుమల్లు అనే వ్యక్తి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశాడు. జుల్పల్లిలో సౌందర్యకు 6 ఎకరాల పొలం ఉంది. దాని ధర అమాంతం పెరగడంతో మోహన్ బాబు తనకు పొలం అమ్మాలని సౌందర్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. సౌందర్య సోదరుడు అమర్నాథ్ తో కూడా మోహన్ బాబు మాట్లాడాడు. ఆయన కూడా అందుకు ఒప్పుకోలేదు. ఆ స్థలం కోసం సౌందర్యను మోహన్ బాబు సాక్ష్యాలు లేకుండా హత్య చేశాడు. వారి మరణం అనంతరం పొలం ఆక్రమించుకున్నాడు.

    ఆ ఆరు ఎకరాల పొలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. అనాథశరణాలయానికో లేదా పోలిసులకో, మీడియా ప్రతినిధులకో కేటాయించాలని కోరుతున్నాను.. అంటూ కలెక్టర్, ఏఎస్పీలను కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భూ వివాదం పై సౌందర్య భర్త రఘు స్పందించారు. ఆయన ఓ లేఖ విడుదల చేశారు. చిట్టిమల్లు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. జుల్పల్లి లో మాకు ఎలాంటి ఆస్తుల లేవు. అలాగే మోహన్ బాబుతో భూవివాదం నెలకొందన్న ఆరోపణల్లో నిజం లేదు. మోహన్ బాబు మాకు సన్నిహితుడు. 25 ఏళ్లుగా ఆ కుటుంబంతో మాకు అనుబంధం ఉంది.. అని రఘు లేఖలో రాసుకొచ్చాడు.

    రఘు లేఖతో చిట్టిమల్లు కంప్లైంట్ లో నిజం లేదు. మోహన్ బాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి లేదా పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ అని పలువురు భావిస్తున్నారు. కాగా చిట్టిమల్లు తన కంప్లైంట్ లో మనోజ్ ప్రస్తావన తేవడం విశేషం. మనోజ్ కి మోహన్ బాబు ఆస్తి పంచేలా చూడాలని ఆ కంప్లైంట్ లో పొందుపరిచాడు. కొద్ది రోజులుగా మనోజ్-మోహన్ బాబు మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. చివరికి భౌతిక దాడుల వరకు వెళ్లారు. కేసులు పెట్టుకున్నారు. మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవిద్యా నికేతన్ లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ ఆరోపణలు చేశాడు. మనోజ్ ముందుకు బానిస అయ్యాడని మోహన్ బాబు విమర్శలు గుప్పించాడు.