
శరవేగంగా దూసుకొస్తున్న తౌక్తే తుఫాను గుజరాత్ ను భయపెడుతోంది. రాష్ట్రంపై తుఫాను తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం సోమవారం లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నౌకాశ్రమాలతోపాటు ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేసింది. దాదాపు రెంవు దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రతతో సంభవిస్తున్న తుపాను ఇదే. ఈ తుఫాను ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా లపై తీవ్ర ప్రభావం చూపించింది. నేటి రాత్రికి గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది.