ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఆయురారోగ్యాలతో జీవితం సాగించాలని, దేశానికి మరింతకాలం సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. భారత ప్రధాని మోదీ నేడు 71వ పుట్టిన రోజు చేసుకుంటున్నారు.