
కోవిడ్ పరిస్థితిపై రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అదివారం సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 74.69 శాతం కేసులు కలిగిన పది రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్ గడ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. రాజస్థాన్ లో 2,08,698 యాక్టివ్ కేసులు ఉండగా 1,77,643 కేసులతో ఉత్తరప్రదేశ్, 1,10,401 కేసులతో ఛత్తీస్ గఢ్ ఆ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.