
టీమ్ ఇండియా యువ క్రికెటర్ హర్లీన్ డియోల్ ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇంగ్లాండ్ తో తొలి టీ20లో అందుకున్న క్యాచ్ అద్భుతమని పొగిడారు. మున్నందు ఇలాగే ఆడాలని ఆకాంక్షించారు. మైగవ్ ఇండియా పంచుకున్న ఈ వీడియోను మోదీ ఇన్ స్టా రీల్స్ లో పోస్ట్ చేశారు. అసాధారణం వెల్ డన్ హర్లీన్ డియోల్ అని వ్యాఖ్య పెట్టారు.