
ఆక్సిజన్ తయారీదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. శుక్రవారం వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఎయిర్ వాటర్ జంషెడ్ పూర్ ఎండీ నొరియో షిబుయ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ కు చెందిన నవీన్ జిందాల్, ఎన్ ఓఎల్ కు చెందిన రాజేశ్ కుమార్ పరాఫ్, లిండే తరఫున ఎం బెనర్జీ, జేఎస్ డబ్ల్యూ తరఫున సజ్జన్ జిందాల్, సెయిల్ చైర్ పర్స్ న్ సోమ మొండల్ తదితరులు పాల్గొన్నారు.