
తౌక్టే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. గుజరాత్, డయ్యూ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఉణ, డయ్యూ, జఫరాబాద్, మహువలలో జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్రా ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వివరించారు. కాసేపట్లో ఆయన ఆహ్మదాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తౌక్టే తుపాను రెండు రోజుల క్రితం గుజరాత్ లోని సౌరాష్ట్ర వద్ద తీరం దాటింది.