
భారత్ లో మోడర్నా, ఫైజర్ టీకాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సింగిల్ డోస్ కోవిడ్ టీకా భారత్ లో విడుదల చేయాలని భావిస్తున్న మోడర్నా ఈసారికే సిప్లా తదితర భారతీయ కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించింది. కాగా భారత్ కు 2022 లో 5 కోట్ల డోసులు పంపిణీ చేయాలని ఫైజర్ బావిస్తున్నది. అయితే నియంత్రణల్లో కొన్ని సడలింపులు కావాలని, నష్టపరిహార నిబంధన కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది. గతవారం రెండు సార్లు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంల ఈ విషయాలు చర్చకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి.