
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల లో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష జూన్ 6న, 7 నుంచి 9వ తరగతులకు జూన్ 5న నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లో ప్రమేశాల కోసం మార్చి నెలలో నోటిఫికేషేన్ విడుదల చేశారు.