MLC Kavitha: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే హక్కు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సోయితో పాలన సాగిందని, ఇప్పడది లేదని విమర్శించారు. రాజీవ్ యువ వికాసానికి తెలంగాణ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీళ్లను చంద్రబాబు తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. జూన్ 2న సీఎం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.