MLC Kavitha: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత నిరసనకు పిలుపునిచ్చారు. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద జూన్ 4న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు. మరోవైపు శనివారం సాయంత్రం బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించనున్నారు.