
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాళ్లతో కొడితే తెరాస కార్యకర్తలు చెప్పులతో కొడతారని ఎల్బీనరగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బ్లకా్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ గా మారారని తీవ్రంగా విమర్శించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇంట్లో రెవెన్యూ టీంను ఉంచుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.