
హూజూర్ నగర్ నియోజకర్గంలో షర్మిల పర్యటనపై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. షర్మిల కుయుక్త డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరనిఆయన విమర్శించారు. మేడారంలో ఒక నిరుద్యోగి కనపడకుండా పోతే తానే కిడ్నాప్ చేయించానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆత్మగౌరవం అనే నినాదంపై ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన తెలిపారు.