MLA Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం డబ్ల్యూగోవిందిన్నెలో ఓ జాతరకు వెళ్లిన ఆమె పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపవాస దీక్షలో ఉండటంతో సోమ్మసిల్లి కింద పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు, సిబ్బంది ఆమెను ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు.