
కరోనా బారినపడి కోలుకుంటున్న దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. చండీగఢ్ లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ లో చికిత్స పొందుతున్న మిల్కా సింగ్ ను రెండు రోజుల క్రితమే కొవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి షిఫ్ట్ చేశారు. అంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షిణించింది. గురువారం రాత్రి ఒక్కసారిగా ఆయనలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయని, జ్వరం కూడా రావడంతో ఆరోగ్యం క్షీణించిందని వైద్యలు తెలిపారు.