Messages and calls are being forwarded to others: మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సైబర్ క్రైమ్స్ పెరుగుతూనే ఉన్న ఈ సమయంలో ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండాల్సిందే. రోజూ ఎంతో మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి బ్యాంక్ అకౌంట్లు పూర్తిగా ఖాళీ అవుతున్నాయి. మరెన్నో సమస్యల్లో చిక్కుకుంటున్నారు అమాయకపు ప్రజలు. అయితే.. ఇప్పుడు మరో ప్రమాదకరమైన విషయం గురించి కూడా తెలుసుకుందాం. మీకు తెలియకుండా మీ ఫోన్ కాల్స్ ఎవరైనా వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. మెసేజ్‌లను ఎవరైనా చదువుతారు కూడా. వెంటనే పసిగట్టి కనిపెట్టాలి. లేదంటే ఊహించని నష్టం జరిగిపోతుంది. ఇంతకీ ఏం చేయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్, మెసేజ్ ఫార్వార్డింగ్ : ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు లేదా ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి అర్జెంట్ గా ఇంట్లో వాళ్లకు లేదా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేయాలి అని అడుగుతారు. అయ్యో దాంట్లో ఏం ఉందిలే అనుకొని అడిగిన వెంటనే ఇస్తుంటారు. అవసరంలో ఉన్నారు కదా అని భావిస్తారు. కానీ.. అవతలి వ్యక్తి మోసగాడు అయితే మాత్రం చాలా డేంజర్ లో పడాల్సిందే. మనకు తెలియకుండానే క్షణాల్లో మన ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్, మెసేజ్ ఫార్వార్డింగ్ లను వారికి అనుగూణంగా మార్చుకుంటారు.
అదే జరిగితే.. మనకు రావాల్సిన ఫోన్ కాల్స్, మెసేజెస్ వారి ఫోన్ కు వెళ్తుంటాయి. అది ఎలా చేస్తారంటే.. ఫోన్ కీ ప్యాడ్ మీద 401 అని టైప్ చేస్తారు. వాళ్ల ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డయల్ కూడా చేస్తారు. అంతే.. ఇలా చేస్తే మనకు తెలియకుండానే మన కాల్స్, మెసేజెస్ అన్నీ వారికి ఫార్వర్డ్ అవుతుంటాయి. దీనివల్ల మన సాధారణ మెసేజెస్ మాత్రమే కాకుండా.. మన యూపీఐ, బ్యాంక్ అకౌంట్‌కు వచ్చే అన్ని ఓటీపీలు కూడా వారి నెంబర్ కు వెళ్తాయి.
కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయా అని ఎలా తెలుసుకోవాలంటే? మీ ఫోన్‌లో కాల్స్, మెసేజెస్ ఇప్పటికే వేరే నెంబర్కు ఫార్వర్డ్ అవుతుంటే వెంటనే ఆపేయాలి. అయితే ముందుగా మీ ఫోన్ కీప్యాడ్లో *#21# అని టైప్ చేసి, డయల్ చేయాలి. దీని వల్ల మీ ఫోన్‌లో కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయా? లేదా అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫార్వర్డ్ లేకపోతే నో టెన్షన్ కానీ ఉంటేనే ఆ తర్వాత ఆ కాల్ ఫార్వర్డ్ ను డిసెబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా?
మీ ఫోన్ కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ అవుతుంటే.. ఆప్షన్ ఎనేబుల్ లో ఉందని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే వెంటనే ఆ ఆప్షన్ డిసేబుల్ చేయడం వల్ల సమస్య తీరుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే మీ కీప్యాడ్లో ##002# అని టైప్ చేసి, డయల్ చేయండి.. అంతే.. ఫార్వర్డ్ ఆప్షన్ వెంటనే డిసేబుల్ అయిపోతుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..