Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Hand Injury : మెగాస్టార్ చిరంజీవి చేతికి ఏమైంది..? ఆందోళనకు గురి చేస్తున్న లేటెస్ట్...

Chiranjeevi Hand Injury : మెగాస్టార్ చిరంజీవి చేతికి ఏమైంది..? ఆందోళనకు గురి చేస్తున్న లేటెస్ట్ ఫోటోలు!

Chiranjeevi Hand Injury : 70 ఏళ్ళ వయస్సులో కుర్ర హీరోలకు కూడా సాధ్యం కానటువంటి ఎనర్జీ తో డ్యాన్స్ లు, ఫైట్స్, యాక్టింగ్ చేస్తూ, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ముందుకు వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రంలో చిరంజీవి నట విశ్వరూపాన్ని చూసి, ఇదెక్కడి ఎనర్జీ బస్సు, కుర్ర హీరోలకు కూడా సాధ్యం అవ్వదు కదా , ఈ వయస్సులో ఆరంభం నుండి ఎండింగ్ వరకు ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తూ వన్ మ్యాన్ షో లాగా ఒక సినిమాని నడిపించడం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి కి తప్ప, మరొకరికి సాధ్యం అవ్వదు. ఈ వయస్సు లో కూడా ఆయన గాయాలను తట్టుకొని మరీ షూటింగ్స్ లో పాల్గొనడం అనేది మామూలు విషయం కాదు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ షూటింగ్ సమయం లో చిరంజీవి కి తీవ్రమైన మోకాళ్ళ నొప్పి సమస్యలు ఉండేవి. షూటింగ్ చేస్తున్నని రోజులు ఆయన ఆ నొప్పి బాధని ఓర్చుకొని చేశాడు. షూటింగ్ పూర్తి అవ్వగానే మోకాళ్ళకు సర్జరీ చేయించుకున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే అల్లు శిరీష్ తన పెళ్లి సందర్భంగా, నిన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మొట్టమొదటి శుభలేఖ ని అందించాడు. ఈ సమయం లో మెగాస్టార్ చిరంజీవి ని చూసిన అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు. ఎందుకంటే ఆయన చేతికి కట్టు కట్టి ఉన్నది. అది చూసిన అభిమానులు అయ్యో..మా బాస్ కి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి షూటింగ్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదే, అయినప్పటికీ ఈ గాయం ఎలా అయ్యింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన చేతికి ఏమైంది అనే విషయం మెగాస్టార్ చిరంజీవి చెప్పే వరకు ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

ఇకపోతే ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. గత నెల 22వ తారీఖు నుండే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉగాది నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్ళ గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్నాడు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తుండగా , మెగాస్టార్ కి జోడిగా విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించబోతున్నట్టు టాక్. ఇక రీసెంట్ గా ఛాంపియన్ మూవీ ద్వారా మన టాలీవుడ్ కి పరిచయమైనా అనశ్వర రాజన్ ఈ చిత్రం లో మెగాస్టార్ కి కూతురిగా నటించబోతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version