Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవమారాల ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. హైదర్ గూడలోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆదిలాబా్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబా్, మెదక్, మల్కాజిగిరి లోక్ సభ స్థానాల నేతలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత ఆదిలాబాద్ లోక్ సభ స్థానాల నేతలతో సమీక్షించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ విడివిడిగా సమావేశం కానున్నారు.