
మిర్చి విత్తనాల నల్లబజారు, అధిక ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ధర కంటే ఎక్కువగా విక్రయిస్తే విత్తనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న మిర్చిని ఆర్ బీకేల ద్వారా సరఫరా చేస్తామన్నారు. విత్తనాల సేకరణ, విక్రయం, పంపిణీపై అధికారులకు పలు సూచనలు చేశారు.