https://oktelugu.com/

Mazaka Movie Review : ‘మజాకా’ ఫుల్ మూవీ రివ్యూ

Mazaka Movie Reviw 'మజాకా' (Mazaka)అనే సినిమా చేశాడు...ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: , Updated On : February 26, 2025 / 11:08 AM IST
Follow us on

Mazaka Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి సందీప్ కిషన్(Sandeep Kishan)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన సక్సెస్ లను అందుకోవడంలో కొంతవరకు వెనుకబడిపోయినప్పటికి గత సంవత్సరం వచ్చిన ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యం తోనే ఇప్పుడు ‘మజాకా’ (Mazaka)అనే సినిమా చేశాడు…ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఈ మూవీ కథ విషయానికి వస్తే రావు రమేష్ తన కొడుకు అయిన సందీప్ కిషన్ ఇద్దరూ ఒకేసారి ప్రేమలో పడతారు. తండ్రి కొడుకులు ఇద్దరు ప్రేమలో పడటం వల్ల జరిగే అనర్ధాలు ఏంటి? తండ్రి ప్రేమను కొడుకు యాక్సెప్ట్ చేశాడా?కొడుకు ప్రేమను తండ్రి సపోర్ట్ చేశాడా? అసలు వీళ్ళు కోరుకున్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ముందుకు సాగుతుంది. వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్న దర్శకుడు ‘త్రినాధరావు నక్కిన’…ఈయన డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే అది కమర్షియల్ సినిమా అనే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాయిగా ఒక రెండు గంటల పాటు థియేటర్లో కూర్చొని నవ్వుకోవచ్చు అనే మైండ్ సెట్ తో థియేటర్ కి వెళ్తే ప్రతి ప్రేక్షకుడిని కూడా ఆయన సినిమాలు మెప్పిస్తాయి.

మరి అదే రీతిలో ఈ సినిమాలో కూడా నాలుగు పాటలు, రెండు ఫైట్లు, మూడు జోకులు అన్నట్టుగానే సినిమా సాగుతూ వచ్చింది… థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని బోర్ కొట్టించకుండా సినిమాని ఎంగేజింగ్ తీసుకెళ్లడం లో మరోసారి త్రినాధరావు కొంత వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బెజవాడ ప్రసన్నకుమార్ రైటింగ్ కూడా కొంతవరకు సినిమాకు ప్లస్ అయింది. అయితే ఆయన ఈ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ని ‘బ్రో డాడి’ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ వాటిని తెలుగు నేటి వీటికి తగ్గట్టుగా మార్చడంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయితే సాధించాడు. ఇక ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లినప్పటికి, సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం ఒక ట్విస్టుతో సెకండ్ హాఫ్ ని స్టార్ట్ చేశాడు.

ఇక సెకెండ్ హఫ్ లో ఆయన ఎత్తుకున్న పాయింట్ పర్ఫెక్ట్ గా పోట్రే చేయడంలో అక్కడక్కడ మిస్ ఫెయిర్ అయ్యారనే చెప్పాలి. దానివల్ల సినిమాలో ఏదో అసంతృప్తి అయితే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ ఒక్కటి కూడా ఫుల్ ఫిల్ చేసినట్టయితే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ ను చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. నటనలో కూడా చాలా పరిణితిని చూపిస్తూ చేసిన యాక్టింగ్ ప్రతికూలందరిని మెప్పిస్తుంది. రావు రమేష్ ఎమోషనల్ సీన్లని చాలా అద్భుతంగా చేశాడు. అలాగే కామెడీ పాత్రలను పోషించడంలో కూడా ఆయనకు ఆయనే దిట్టా అంటూ చాలా బాగా నటించి మెప్పించడం అనేది అందరినీ ఆకర్షించింది.

ఇక రీతు వర్మ కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ అయితే ఇచ్చి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించింది. చాలా రోజుల తర్వాత అన్షు సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె పాత్ర కూడా సినిమాలో చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందనే చెప్పాలి… ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రలో పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ అంత పెద్దగా మెప్పించినప్పటికీ ఒక ఫోక్ సాంగ్ మాత్రం చాలా బాగా ప్రేక్షకులు అలరించిందనే చెప్పాలి. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ ఓవరాల్ గా మ్యూజిక్ విషయంలో మాత్రం ఈ సినిమా చాలావరకు డల్ అయిందనే చెప్పాలి.ఇక ఎమోషనల్ సీన్స్ లో కొంత వరకు బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు అనిపించేలా ఉంది…ఇక విజువల్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని షాట్స్ మాత్రం విజువల్స్ చాలా అద్భుతంగా కుదిరాయి…ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో వచ్చే ఫైట్ సీన్ లో విజువల్స్ చాలా బాగా వచ్చాయి. ఫైట్ హైలెట్ అయ్యే విధంగా కుదిరాయి…ఎడిటింగ్ కూడా చాలా బాగా ప్లస్ అయింది…చాలా ఎక్కువ షాట్స్ ను ఎడ్జ్ లో కట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేశారు…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…

ప్లస్ పాయింట్స్

డైరెక్షన్
ఫస్ట్ హాఫ్
ఒక్క సాంగ్

మైనస్ పాయింట్స్

రోటీన్ స్టోరీ
సెకండ్ హాఫ్

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

MAZAKA Trailer | Sundeep Kishan | Ritu Varma | Trinadharao Nakkina | Leon James | Anil Sunkara