https://oktelugu.com/

Vishnupriya : విష్ణుప్రియ ఎవరో తెలియదు?… బిగ్ బాస్ హౌస్లో రొమాన్స్ చేసి, బయటకు వచ్చాక పృథ్వి షాకింగ్ కామెంట్స్!

Vishnupriya : బిగ్ బాస్ సీజన్ 8లో విష్ణుప్రియ-పృథ్విరాజ్ నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. ఘాడంగా ప్రేమించుకున్నారు. ముఖ్యంగా పృథ్విరాజ్ అంటే విష్ణుప్రియ విపరీతమైన ప్రేమ చూపించేది. ప్రస్తుతం వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది? విష్ణుప్రియతో పృథ్వి టచ్ లో ఉన్నాడా?

Written By: , Updated On : February 26, 2025 / 11:10 AM IST
Vishnupriya

Vishnupriya

Follow us on

Vishnupriya : ప్రతి సీజన్లో బిగ్ బాస్ హౌస్ వేదికగా ఒక ప్రేమ జంట అవతరిస్తుంది. సీజన్ 8లో విష్ణుప్రియ-పృథ్విరాజ్ హైలెట్ అయ్యారు. ఫస్ట్ ఎపిసోడ్ నుండే పృథ్విరాజ్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది విష్ణుప్రియ. అయితే సోనియా ఆకులతో పృథ్వి సన్నిహితంగా ఉండేవాడు. సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యాక విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యింది. సందు దొరికితే అతడితో రొమాన్స్ చేసేది. ముద్దులు హగ్గులతో రెచ్చిపోయేది. పృథ్వి కూడా ఆమె ప్రేమను అంగీకరించాడు.

పృథ్విరాజ్ చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. అయినప్పటికీ పది వారాలకు పైగా రాణించాడు. అందుకు విష్ణుప్రియతో లవ్ ట్రాక్ కూడా కారణం అనే టాక్ ఉంది. విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. కానీ ఆమె ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమె ధ్యాస మొత్తం పృథ్వితో రొమాన్స్ చేయడం మీదే ఉండేది. ఈ కారణంగానే విష్ణుప్రియ కనీసం ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది. మరి బయటకు వచ్చాక పృథ్వి-విష్ణుప్రియ కలిసి ఉంటున్నారా? పెళ్లి చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు పృథ్వి సమాధానం చెప్పాడు.

తాజా ఇంటర్వ్యూలో యాంకర్ నేరుగా పృథ్విని… విష్ణుప్రియతో పెళ్లి ఎప్పుడు? అని అడిగారు. సమాధానంగా పృథ్వి… ఒక ఏడాదిలో విష్ణుప్రియకు పెళ్లి అయ్యే అవకాశం ఉంది. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, అన్నారు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదా? అని యాంకర్ అడగ్గా.. అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే వరకు విష్ణుప్రియ ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రేరణ, నిఖిల్.. ఒక షోలో పరిచయం అయ్యారు. కానీ విష్ణుప్రియతో షోకి ముందు పరిచయం లేదు. మేము మంచి మిత్రులం మాత్రమే అని తేల్చేశారు.

ఇక బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అంటారు నిజమేనా? అన్న ప్రశ్నకు.. షోకి వెళ్లక ముందు నేను కూడా స్క్రిప్టెడ్ అనుకున్నాను. కానీ అది నిజం కాదు. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు. రోజు మొత్తం జరిగే విషయాలను ఒక గంట ఎపిసోడ్ లో చూపిస్తారు. ఏమి చూపించాలి అనేది ఎడిటర్ చేతిలో ఉంటుంది, అన్నారు. పృథ్వి రాజ్ మాటలు పరిశీలిస్తే.. విష్ణుప్రియతో ఆయనకు స్నేహం మాత్రమే ఉంది. పృథ్వి తెలుగులో నాగ పంచమి సీరియల్ చేశాడు.