Maoist Party Leader Sudhakar: మావోయిస్టు పార్టీకి మరో ఎదరుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందాడు. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. ఆయన పై 50 లక్షల రివార్డు ఉంది. 40 ఏళ్లుగా మావొస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్ అలియాస్ సింమాచలం బీజాపూర్ జాతీయపార్కు వద్ద గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది.