London job quit story : ఏడాదికి 40 లక్షల జీతం.. లండన్ నగరంలో జీవనం.. ఇలాంటి జీవితాన్ని ఎవరైనా వదులుకుంటారా.. ఉద్యోగానికి గ్యారెంటీ లేని నేటి కాలంలో.. ఇటువంటి వ్యక్తి కూడా ఉంటారా.. అనే సందేహం మీలో కలుగుతుంది కదా. కానీ ఇతడు 40 లక్షలను పక్కన పెట్టాడు. లండన్ లో జీవితాన్ని వదిలేశాడు. సంచలన నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో పడేశాడు.
అతడి పేరు మానవ్ షా.. ఉన్నత చదువులు చదివాడు. ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అతని ప్రతిభకు తగ్గట్టుగా కంపెనీ 40 లక్షల వార్షిక వేతనాన్ని ప్రకటించింది.. పైగా అతడు లండన్ లో నివాసం ఉండడానికి యోగ్యతను సాధించాడు. ఇన్ని రకాలుగా సౌలభ్యాలు.. సౌకర్యాలు ఉన్నప్పటికీ.. అతడు 40 లక్షల వార్షిక వేతనాన్ని వదులుకున్నాడు. లండన్ నగరంలో ఉండడాన్ని పక్కన పెట్టాడు. మరో మాటకు తావు లేకుండా పుణ్యభూమి నాదేశం.. ధన్య భూమి నా దేశం అనే పాటను పాడుకుంటూ ఇండియాకు తిరిగి వచ్చేసాడు.
లండన్ లో జీవితం అతడికి బంగారు పంజరం మాదిరిగా అనిపించిందట. విదేశాలలో ఒంటరిగా ఉండడం అతనికి ఇష్టం లేదట. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల అతడు ఇబ్బంది పడుతున్నారట. అందువల్లే భారత దేశంలో వ్యాపారం ప్రారంభించి.. తన కలలను సహకారం చేసుకోవడానికి మాతృదేశానికి వచ్చాడట. డబ్బు కంటే సంతోషం ముఖ్యమని.. కుటుంబంతో ఉండాలని అనుకున్నాడట. అందువల్లే మాతృదేశానికి వచ్చాడట.
నేటి కాలంలో డబ్బు సంపాదన కోసం చాలామంది యువత విదేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే మనదేశ పౌరసత్వాన్ని కూడా వదులుకుంటున్నారు. అమెరికా, ఇతర దేశాలకు వెళ్లి డాలర్లు సంపాదిస్తున్నారు. అక్కడే జీవిస్తున్నారు. ఇక్కడ చదువు చదివి.. ఇక్కడ అనేక రకాలుగా సౌకర్యాలు పొంది.. చివరికి మాతృదేశాన్ని వదిలిపెడుతున్నారు. కానీ అటువంటి వారికి మానవ్ షా మాతృదేశం మీద మమకారం ఎందుకు పెంచుకోవాలో చూపిస్తున్నాడు. నేటి కాలంలో ఉద్యోగం సంపాదించడం కష్టంగా మారింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం మరింత ఇబ్బందిగా మారింది. ఇటువంటి తరుణంలో మానవ్ తన ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు. లండన్ లో జీవితాన్ని తీసి అవతల పడేశాడు.
డబ్బు మాత్రమే జీవితానికి సుఖాన్ని ఇవ్వదని.. తల్లిదండ్రుల మధ్య గడపడానికి మించిన ఆనందం లేదని.. ఉన్న ఊరు స్వర్గంతో సమానమని నిరూపించాడు.. నేటి కాలంలో సంపాదనకు అలవాటు పడిన వారందరికీ మానవ్ గొప్ప పాఠాన్ని చెబుతున్నాడు. సొంత ఊర్లో వ్యాపార మొదలుపెట్టి.. ఎంతో మందికి ఉపాధి ఇవ్వాలని మానవ్ భావిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప శ్రీమంతుడు ఇంకా ఎవరు ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.